![]() |
![]() |

జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జోర్దార్ వార్తలు చదువుతూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఫుల్ ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ని పెళ్లి చేసుకుని మస్త్ లైఫ్ లీడ్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ ఐన "సేవ్ ది టైగర్స్" సిరీస్ లో నటించి ఫుల్ కామెడీ పంచింది. సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉండే సుజాత ఇప్పుడు "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అని అడిగింది. ఇక నెటిజన్స్ ప్రశ్నలు మాములుగా లేవు. "మీ వివాహ జీవితం ఎలా ఉంది" " చాలా బాగుంది".."అక్కా నువ్వు హీరోయిన్ లా ఉంటావ్ తెలుసా" అంటే అన్నావ్ కానీ ఆ మాట ఎంత బాగుందో..థ్యాంక్యూ" "హాయ్ అక్క..సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఎప్పుడొస్తుంది...మేమంతా దాని కోసం వెయిటింగ్".."ఆన్ ది వే..త్వరలో వస్తుంది"

.."మళ్ళీ అమెరికాకి ఎప్పుడు వెళ్తున్నారు?" "ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియడం లేదు. అంతా రాకేష్ గారి మాయ".. "మీ అత్తగారు చేసే వంటల్లో ఏది ఇష్టం" " అన్ని రకాల వెజ్ వెరైటీస్"..."హాయ్ అక్క మీరు ఇండస్ట్రీకి రాకపోతే ఎం అయ్యేవారు" " పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం మే బి పోలీస్ అయ్యేదాన్నేమో" అని టకటకా ఆన్సర్స్ ఇచ్చేసింది సుజాత. ఇక తన సెల్ వాల్ పేపర్ మీద ఉన్న ఫొటోస్ ని అలాగే తన పెళ్లి ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో అడిగిన ఫాన్స్ తో షేర్ చేసుకుంది సుజాత. ఇక రీసెంట్ గా వరంగల్ కి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్.. లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు రాకింగ్ రాకేష్ సుజాతతో కలిసి వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.
![]() |
![]() |